ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 2026, మార్చి 3న ‘హనుమాన్ ప్రాజెక్టు’ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణే లక్ష్యంగా హనుమాన్ (హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్) ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు ఆయన అన్నారు.
వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే.. పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.