ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) విభాగాల్లోని అన్ని స్థాయుల్లో నేటికీ గణనీయమైన లింగ అంతరం కొనసాగుతోంది. స్త్రీలు విద్యలో రాణించడంతోపాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నాయకత్వ స్థాయికి ఎదగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహిస్తారు. ఎస్‌టీఈఎం రంగాల్లో విజయవంతమైన స్త్రీలను  గౌరవించుకోవడంతోపాటు వారి సహకారాన్ని గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

  • మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి సహకారంతో మరెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. లింగ అసమానతలు, సామాజిక కట్టుబాట్లు లాంటివి వారు తమ ఆశలు, లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. 
  • శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వారి భాగస్వామ్యంలో గణనీయమైన అంతరం కొనసాగుతోంది. 

గణాంకాలు

  • ఐక్యరాజ్యసమితి విశ్లేషణ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా స్టెమ్‌ విద్య, కెరీర్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్లలో స్త్రీల సంఖ్య కేవలం 35% గా ఉంది.
  • యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) 2025లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధనల్లో మూడింట ఒక వంతు (33%) మాత్రమే మహిళలు ఉన్నారు. పరిశోధనా స్థానాల్లో నాయకత్వం వహించే మహిళలు 30% కంటే తక్కువ ఉన్నారు. ఎస్‌టీఈఎం ఉద్యోగాల్లో వీరు 28.2% మాత్రమే ఉన్నారు.

భారత్‌లో పరిస్థితి..

  • ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) గ్రాడ్యుయేట్లలో దాదాపు 43% మహిళలు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఎస్‌టీఈఎం ఉద్యోగాల్లో మాత్రం వారి వాటా కేవలం 14% మాత్రమే. 
  • మన దేశంలో టెన్త్, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో దాదాపు అమ్మాయిలదే పైచేయిగా ఉంటోంది. ఉత్తీర్ణత, ర్యాంకుల్లో వారే ముందువరుసలో ఉంటున్నారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారు.  

చారిత్రక నేపథ్యం

  • 2013, డిసెంబరు 20న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ‘అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ’ (science, technology and innovation for development) అనే తీర్మానాన్ని ఆమోదించింది. అందులో లింగ సమానత్వం, మహిళలు - బాలికల సాధికారతకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో సమాన అవకాశాలు, భాగస్వామ్యం తప్పనిసరని పేర్కొంది. ఈ భావనను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా జరుపుకోవాలని 2015లో ప్రకటించింది.  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) ఫిబ్రవరి 8        2) ఫిబ్రవరి 9

3) ఫిబ్రవరి 10        4) ఫిబ్రవరి 11

సమాధానం: 4

2. ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’ను ఎవరు నెలకొల్పారు? (ఓపీఎస్‌సీ ఓఏఎస్, 2016)

1) యూఎన్‌ఓ         2) ప్రపంచ బ్యాంక్‌

3) యునెస్కో          4) ప్రపంచ ఆరోగ్య సంస్థ

సమాధానం: 1

3. When was the International Day of Women and Girls in Science first established by the United Nations General Assembly? (PSPCL LDC, 2019)
1) 2014               2) 2015            3) 2016               4) 2017
Answer: 2

4. Which of the following schemes was initiated with the intention of creating a level-playing field for meritorious Indian girls from grades 9 to 12 to pursue Science, Technology, Engineering, and Mathematics (STEM) in their higher education? (SSC JE CE, 2021)
1) Vigyan Aradhana            2) Vigyan Sankalp
3) Vigyan Sadhna            4) Vigyan Jyoti
Answer: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram