జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా

జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా
  • తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త పరిపాలన వ్యవస్థ ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం, మూడింటికీ ప్రత్యేక అధికారి నియామకం, పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన పలు ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుత కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ నూతన జీహెచ్‌ఎంసీ పగ్గాలు చేపట్టారు. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ(సీఎంసీ) కమిషనర్‌గా జి.సృజన హైటెక్‌సిటీలోని న్యాక్‌ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. తార్నాక చౌరస్తాలోని పాత హెచ్‌ఎండీఏ భవనంలో ఏర్పాటైన మల్కాజిగిరి నగరపాలక సంస్థ(ఎంఎంసీ) కార్యాలయంలో టి.వినయ్‌కృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
  • 2026, ఫిబ్రవరి 10తో గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలకమండలి గడువు పూర్తయినందున... మేయర్‌ స్థానంలో స్పెషల్‌ ఆఫీసర్‌గా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మూడు కార్యాలయాలకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram