లీడ్‌ బ్యాంక్‌ పథకం

లీడ్‌ బ్యాంక్‌ పథకం

జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్‌ బ్యాంక్‌ పథకం (ఎల్‌బీఎస్‌)లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సవరిస్తూ 2026, ఫిబ్రవరి 13న ముసాయిదాను విడుదల చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అభివృద్ధి సంస్థలను సమన్వయం చేస్తూ, ప్రాధాన్య రంగాలకు రుణ మంజూరును పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. తాజా ప్రతిపాదనల ప్రకారం.. పథకం లక్ష్యాలు, నిర్మాణం, సభ్యత్వం, వివిధ వేదికల అజెండా, కీలక అధికారుల బాధ్యతలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ కార్యాలయాలను బలోపేతం చేయడం లాంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram