రంజీ ట్రోఫీ

రంజీ ట్రోఫీ
  • భారత దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది. 67 ఏళ్ల తన రంజీ చరిత్రలో తొలిసారిగా ఈ జట్టు విజేతగా నిలిచింది. 2026, ఫిబ్రవరి 28న హుబ్బళి వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటకపై జమ్మూకశ్మీర్‌ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌ 584 పరుగుల భారీ స్కోరు సాధించగా.. కర్ణాటక 293 పరుగులకే ఆలౌటైంది. జమ్మూకశ్మీర్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన శుభమ్‌ పుందిర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా.. ఈ రంజీ సీజన్లో 60 వికెట్లు పడగొట్టడమే కాక, 245 పరుగులు చేసిన ఆకిబ్‌ నబి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు.
  • జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 293; జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌: 342/4 డిక్లేర్డ్‌ (కమ్రాన్‌ ఇక్బాల్‌ 160 నాటౌట్, సాహిల్‌ లోత్రా 101 నాటౌట్‌; ప్రసిద్ధ్‌ కృష్ణ 2/42)
  • రంజీ ట్రోఫీ గెలిచిన 18వ జట్టు జమ్మూకశ్మీర్‌. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram