ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం

ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం

పప్పుధాన్యాలు ఆహారంలో అంతర్భాగం. ఇవి ముఖ్యమైన ప్రోటీన్‌ వనరు. పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కలు కావడంతో అవి భూసారాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. మానవ పోషణ, పర్యావరణ శ్రేయస్సు, సుస్థిర వ్యవసాయంలో పప్పుధాన్యాల పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 10న ‘ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం’గా (World Pulses Day) నిర్వహిస్తారు. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే బహుళ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంతోపాటు ఆహార భద్రత సాధనలో వీటి పాత్రను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పప్పుధాన్యాల అవసరం..

  • ఇవి లెగ్యుమినేసి జాతిలో ఉప సమూహం. పోషకాహారానికి పప్పుధాన్యాలు కీలకమైన వనరు. మాంసంతో పోలిస్తే తక్కువ ధరలోనే వీటి నుంచి ప్రోటీన్‌ను పొందొచ్చు. వీటి వినియోగం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది, రక్తంలో చక్కెల స్థాయులు సక్రమంగా ఉంటాయి. అధిక బరువు నియంత్రిత స్థాయిలో ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ఉదా: కంది, మినుములు, పెసలు, శెనగలు, మసూర్‌ దాల్‌ మొదలైనవి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు ప్రకారం, ప్రతి వ్యక్తి రోజుకు 80 గ్రాముల పప్పుధాన్యాలు వినియోగించాలి. వీటిని పేదల ప్రోటీన్‌గా పేర్కొంటారు. 

దేశంలో ఉత్పత్తి.. వినియోగం

  • పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, దిగుమతుల పరంగా భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో వీటి వాటా 7 నుంచి 10% దాకా ఉంటోంది. మన దేశంలో రబీ కాలంలోనే అత్యధికంగా 60శాతం వరకు పప్పుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. 
  • కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2025, సెప్టెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023-24లో 175.72 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగింది. 2024-25లో ఇది 180.16 లక్షల టన్నులకు పెరిగింది. సాగు సైతం 79 లక్షల ఎకరాల నుంచి 90 లక్షల ఎకరాలకు చేరింది. దేశంలో గత అయిదు దశాబ్దాల్లో ఇదే అత్యంత ఎక్కువ పెరుగుదల.

చారిత్రక నేపథ్యం

  • ప్రజలు ఆరోగ్యకర జీవనాన్ని సాగించడంలో పప్పుధాన్యాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. తక్కువ ఖర్చుతో మానవ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ వీటి ద్వారా లభిస్తుంది. వీటి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) 2013, డిసెంబరులో 2016 ఏడాదిని ‘అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. అలాగే పప్పుధాన్యాల ప్రాముఖ్యతను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 10న ‘ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం’గా జరుపుకోవాలని 2018, డిసెంబరులో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 2019 నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? (ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ మెయిన్స్, 2020)

1) మార్చి 7        2) ఏప్రిల్‌ 11

3) ఫిబ్రవరి 9        4) ఫిబ్రవరి 10

5) మార్చి 11

సమాధానం: 4

2. ‘నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ ఆన్‌ పల్సెస్‌’ అనే పథకం ఎప్పుడు ప్రారంభమైంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ సోషల్‌ సైన్స్, 2021), (ఓపీఎస్‌సీ ఓఏఎస్, 2016)

1) 2000    2) 2012

3) 2007    4) 2004

సమాధానం: 3

3. As per the United Nations, World Pulses Day is observed on which of the following dates? (PSPCL LDC, 2019)
1) 20th February        2) 1st February 
3) 28th February        4) 10th February
Answer: 4

4. Which one of the following states is the largest producer of pulses in India?
(SSC CPO, 2019), (UKPSC RO/ARO, 2016), (MP Police Constable 2023)
1) Bihar            2) Madhya Pradesh
3) Uttarakhand        4) Haryana
Answer: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram