గద్దర్‌ సినీ అవార్డులు-2025

గద్దర్‌ సినీ అవార్డులు-2025
  • 2025 ఏడాదికి సంబంధించిన గద్దర్‌ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం 2026, మార్చి 7న ప్రకటించింది. ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌’ నుంచి వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రం సహా మొత్తం నాలుగు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సాయిలు కాంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్‌ కులకర్ణి ఎంపికయ్యారు. అలాగే ఇందులో కీలకపాత్ర పోషించిన చైతు జొన్నలగడ్డకు ప్రత్యేక జ్యూరీ పురస్కారం దక్కింది. 
  • ‘తండేల్‌’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాకి ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు సొంతం చేసుకున్నారు. 
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి కలయికలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచింది. 
  • ఉత్తమ సామాజిక సందేశాత్మక సినిమాగా ‘కోర్ట్‌’ సత్తాచాటింది. మార్చి 19న ఉగాది పండగ రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • ఈసారి గద్దర్‌ అవార్డుల కోసం 90 సినిమాలు పోటీపడగా.. జ్యూరీ ఛైర్మన్‌ మణిశర్మ ఆధ్వర్యంలోని సభ్యులు వాటిని వీక్షించి ఎంపిక చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram