జాతీయ భద్రతా దినోత్సవం

జాతీయ భద్రతా దినోత్సవం

దేశంలోని ప్రజలకు రక్షణ (Security), భద్రత (Safety) కల్పించే సామర్థ్యాన్ని జాతీయ భద్రత అంటారు. అంతర్గత స్థిరత్వం, భౌగోళిక ప్రయోజనాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ రక్షణే ధ్యేయంగా నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) ఆఫ్‌ ఇండియా ఏర్పాటైంది. దీని ఆవిర్భావానికి గుర్తుగా ఏటా మార్చి 4న ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా (National Safety Day) నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య నియమాలు, ట్రాఫిక్‌ నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

జాతీయ భద్రత అంటే?

  • కేవలం శత్రు దేశాల నుంచి వచ్చే ఆపదలను ఎదుర్కోవడమే జాతీయ భద్రత కాదు. ఉగ్రవాదాన్ని నివారించడం, అంతర్గత నేరాలను తగ్గించడం, ఆర్థిక భద్రత, ఇంధన స్థిరత్వం, పర్యావరణ రక్షణ, ఆహార భద్రత, సైబర్‌ సెక్యూరిటీ మొదలైన అంశాలన్నీ జాతీయ భద్రతలో భాగమే
  • బయటి వ్యక్తులతో పాటు ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా ప్రభావితులైన స్వదేశీయులు కూడా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించే చర్యల్లో పాల్గొంటారు
  • మనం తీసుకునే ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా వరకు రక్షణ పొందొచ్చు. రోడ్లపై ప్రయాణించే సమయంలో సేఫ్టీ రూల్స్‌ పాటించడం, పని ప్రదేశాల్లో (కార్యాలయాలు, ఫ్యాక్టరీలు) ప్రమాదాల నివారణకు భద్రతాపరమైన ప్రోటోకాల్స్‌ చేపట్టడం, పర్యావరణానికి హాని కలిగించే వస్తువులు, చర్యలను నిషేధించడం, ఆరోగ్య సూత్రాలు అనుసరించడం లాంటి చర్యలతో మనతోపాటు ఇతరులను కాపాడొచ్చు.
  • బయటి నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడంతోపాటు అంతర్గత రక్షణ కోసం సైన్యం, పోలీస్‌ వ్యవస్థ, కమాండోలు, పారామిలటరీ లాంటి ఎన్నో భారత భద్రతా దళాలు పనిచేస్తున్నాయి. వ్యక్తిగత, పర్యావరణ రక్షణ మాత్రం సంబంధిత సంస్థలు, వ్యక్తుల చేతుల్లోనే ఉంది. 

నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ)

  • కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్య సంస్థలు, ట్రేడ్‌ యూనియన్ల సహకారంతో 1965, డిసెంబరు 11 - 13 వరకు న్యూదిల్లీలో పారిశ్రామిక భద్రతపై ఒక సమావేశం నిర్వహించింది
  • 1966, ఫిబ్రవరిలో జరిగిన స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ 24వ సెషన్‌లో జాతీయ భద్రతా మండలి ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. దీని ప్రకారం 1966, మార్చి 4న జాతీయ భద్రతా మండలి ఏర్పాటైంది.
  • జాతీయ స్థాయిలో భద్రత (Safety), ఆరోగ్యం (Health), పర్యావరణం (Environment) - SHEపై స్వచ్ఛంద ఉద్యమాన్ని రూపొందించడం, అభివృద్ధి చేయడం, కొనసాగించడం అనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు.

నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ లక్ష్యాలు

  • పని ప్రదేశంలో, దైనందిన జీవితంలో భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం.
  • దేశవ్యాప్తంగా భద్రత, ఆరోగ్యం, పర్యావణం - SHE ఉద్యమాన్ని విస్తరించడం
  • భద్రత, ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన అన్ని విషయాలపై కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు, డిజిటల్‌ ప్రచారం నిర్వహించడం.
  • ప్రమాదాలను నివారించడానికి, తగ్గించడానికి; వాటి పరిమాణాన్ని లెక్కించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం
  • పరిశ్రమలు, కార్యాలయాలు, గృహాలు, పబ్లిక్‌ స్థలాల్లో భద్రతా సమస్యల గురించి అవగాహన పెంచడం, సురక్షిత పద్ధతులను ప్రోత్సహించడం.

చారిత్రక నేపథ్యం

  • సమాజంలోని అన్ని రంగాల్లో భద్రతపై అవగాహన కల్పించే ధ్యేయంతో భారత ప్రభుత్వం 1966, మార్చి 4న నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) ఆఫ్‌ ఇండియాను నెలకొల్పింది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది. భద్రతపై విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 4 నుంచి 11 వరకు జాతీయ భద్రతా వారోత్సవాలను (National Safety Week) నిర్వహిస్తారు.   

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?(నావిక్‌ జనరల్‌ నాలెడ్జ్, 2021)

1) మార్చి 4   2) నవంబరు 10

3) ఆగస్టు 5   4) జులై 6

సమాధానం: 1

2. జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైంది?(ఎంపీ పట్వారీ గ్రూప్‌ 2, 2023)

1) 1966    2) 1958            3) 1969    4) 1953

సమాధానం: 1

3. When reporting a fire in an emergency, what is the most critical information to provide to emergency services?(RRB ALP CBT-II (Machinist), 2025)

1) The weather conditions at the time of the fire

2) How the fire started and if someone is injured or missing

3) The likely cause of the fire and the building owner's name

4) The colour of the smoke and the direction it is moving

Answer: 2

4. Which of the following is NOT the cause of electric fire?(ALP CBT 2 Fitter, 2019)

1) Open doors             2) Electric short circuit

3) Loose connection         4) Over loading on wires

Answer: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram