ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు

ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు
  • తెలంగాణలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 2026, మార్చి 7న జరిగిన ఏడు సంప్రదాయ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల సమావేశంలో అందుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
  • ఈ నిర్ణయం వల్ల న్యాక్, ఎన్‌బీఏ, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ తదితర వాటిల్లో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం, ఆయా విభాగాల నుంచి పరిశోధన నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. మండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram