అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతోపాటు గుర్తింపును ఇస్తుంది. సంప్రదాయాలు, వారసత్వంలో లోతైన బంధాన్ని ఏర్పర్చడంలో సాయం చేస్తుంది. మెరుగైన అభ్యాసం, అవగాహనకు మాతృభాష వాడకం అవసరం. కేవలం సమాచారాన్ని తెలపడానికే కాకుండా మన సంస్కృతిలో భాగమైన మాతృభాష ఔన్నత్యాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 21న ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా (International Mother Language Day) నిర్వహిస్తారు. భాషా వైవిధ్యాన్ని, అంతరిస్తోన్న భాషలను కాపాడటంతోపాటు బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

మాతృభాష అవసరం

  • మాతృభాష అనేది మన ప్రాథమిక భాష. మనం నివసిస్తోన్న సమాజంలోని వ్యక్తులను అనుసంధానించడానికి ఇది తోడ్పడుతుంది. ఏదైనా విషయంపై అవగాహన పెంపొందించుకోవడానికి లేదా జ్ఞాన సముపార్జనకు మాతృభాష అభ్యసనం చాలా ఉపయోగపడుతుంది.
  • ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి ఎక్కువ భాషలు మాట్లాడగల సామర్థ్యం అవసరం. ఇందుకోసం అనేకమంది ప్రజలు తమ మాతృభాషను విస్మరించి విదేశీ భాషలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సాంస్కృతిక గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
  • పిల్లలు మాతృభాషలో నేర్చుకోవడం వల్ల అభిజ్ఞా వికాసం (cognitive development), విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలు (critical thinking skills) మెరుగైనట్లు అనేక శాస్త్రీయ ఆధారాలున్నాయి.
  • మాతృభాష ఎప్పటికీ తర్వాతి భాష అభ్యాసానికి పునాదిగా ఉంటుంది.

గణాంకాలు

  • యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) - వరల్డ్‌ అట్లాస్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 8,324 భాషలు ఉన్నాయి.
  • ప్రపంచ జనాభాలో దాదాపు 40% మందికి తాము అర్థం చేసుకోగల లేదా మాట్లాడగల భాషలో విద్య అందడం లేదు.
  • అనేక గిరిజన భాషలు అంతరించిపోతున్నాయి. కొన్నింటిని కేవలం వెయ్యి మంది మాత్రమే మాట్లాడుతున్నారు.
  • ప్రపంచ భాషల్లో దాదాపు 43% అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని వందల భాషలను మాత్రమే అధికారిక విద్య లేదా డిజిటల్‌ రంగంలో వినియోగిస్తున్నారు.

చారిత్రక నేపథ్యం

  • 1999, నవంబరులో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఫిబ్రవరి 21న ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. 2000 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

(సీటీఈటీ సోషల్‌ స్టడీస్, 2024)

1) ఫిబ్రవరి 21        2) ఏప్రిల్‌ 13

3) జనవరి 1        4) ఫిబ్రవరి 14

సమాధానం: 1

2. భారత రాజ్యాంగంలో భాషలకు సంబంధించిన షెడ్యూల్‌ ఏది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2025)

1) 7వ షెడ్యూల్‌        2) 10వ షెడ్యూల్‌

3) 8వ షెడ్యూల్‌        4) 9వ షెడ్యూల్‌

సమాధానం: 3

3. 1967లో కింది దేన్ని భారతదేశ అధికార భాషల జాబితాలో చేర్చారు?(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2022)

1) మణిపురి         2) నేపాలీ

3) కొంకణి            4) సింధీ

సమాధానం: 4

4. In which amendment to the constitution were the Bodo, Dogri, Santhali and Maithli added to the list of recognised languages?(SSC GD, 2019)
1) 73rd Constitution Amendment Act of 1992
2) 92nd Constitution Amendment Act of 2003
3) 103rd Constitution Amendment Act, 2018
4) 101st Constitution Amendment Act, 2016
Ans: 2
5. Consider the following statements :
1. 21st February is declared to be the International Mother Language Day by UNICEF.
2. The demand that Bangla has to be one of the national languages was raised in the Constituent Assembly of Pakistan.
Which of the above statement is/are correct?
(UPSC Civil Services Exam (Prelims) 2021)
1) 1 only            2) 2 only
3) Both 1 and 2        4) Neither 1 nor 2
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram