ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం
  • ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్‌ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ఇన్‌ఛార్జ్‌ ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది.
  • తాజాగా ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యంను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 2026, ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram