నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయం

నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయం
  • హిమాలయ దేశం నేపాల్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)’ అఖండ విజయం సాధించింది. నేపాల్‌ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానాలను దామాషా విధానంలో భర్తీ చేస్తారు. మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 165 స్థానాలకుగాను ఇప్పటివరకూ 159 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి.
  • వీటిలో ఆర్‌ఎస్‌పీ 122 సీట్లు గెల్చుకుంది. 17 సీట్లతో నేపాలీ కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. మాజీ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌) ఖాతాలో ఇప్పటివరకు ఎనిమిది సీట్లే చేరాయి. మరో రెండు చోట్ల అది ఆధిక్యంలో ఉంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram