తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా

తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా
  • తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు బదిలీచేసి ఆ స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాను కేంద్రం నియమించింది. జిష్ణుదేవ్‌వర్మ దాదాపు 20 నెలలు గవర్నర్‌గా తెలంగాణకు సేవలు అందించారు. ఆయన 2024 జులై 31న తెలంగాణకు నాలుగో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 
  • 1952 ఏప్రిల్‌ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా రుద్రాపుర్‌ గ్రామంలో జన్మించిన శుక్లా ఇదివరకు మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.  
  • 2023 ఫిబ్రవరి 18న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram