ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణం

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణం
  • అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మృతిని 2026,  మార్చి 1న ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ.. ఇరాన్‌ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టి పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఓ ప్రాంతీయ శక్తిగా నిలిపారు. ఖమేనీ 1939లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. చిన్న వయసులోనే షియా మత బోధకుడిగా మారారు. ఇరాన్‌ రాజు మహమ్మద్‌ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా జరిగిన 1979 ఇస్లామిక్‌ విప్లవంలో పాల్గొన్నారు. 1981లో అప్పటి అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ రెజాయ్‌ బ్రీఫ్‌కేస్‌ బాంబు దాడిలో చనిపోయారు. దీంతో ఖమేనీ అధ్యక్ష బరిలోకి దిగారు. సుప్రీం నేత రూహుల్లా ఖొమైనీ అండ కూడా ఉండటంతో ఆయన విజయం సాధించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram