జనాభా నిర్వహణ విధానం

జనాభా నిర్వహణ విధానం
  • దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2026, మార్చి 5న అసెంబ్లీలో తెలిపారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఈ పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నెల రోజులపాటు చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏప్రిల్‌ 1 నుంచి అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
  • రెండో బిడ్డ, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు రూ.25 వేల చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇద్దర్ని మించి కనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram