ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్‌ అవార్డు విజేతగా మనకు సుపరిచితం


ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్‌ అవార్డు విజేతగా మనకు సుపరిచితం. అయితే ఆ స్థాయికి చేరే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం. చిన్నతనంలో చురుగ్గా లేరు. మాటలు సరిగ్గా రాలేదు. చదువులోనూ అంతంత మాత్రమే. వీటన్నింటినీ అధిగమించి, విజ్ఞానశాస్త్ర తీరు తెన్నులనే మార్చే శక్తిగా ఐన్‌స్టీన్‌ ఎదిగారు. ఆయన సాపేక్షతా సిద్ధాంతాన్ని (Theory of Relativity) రూపొందించారు, కాంతి విద్యుత్‌ ప్రభావాన్ని (photoelectric effect) కనుక్కున్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆవిష్కరణలు ఆధునిక భౌతికశాస్త్రానికి మూల స్తంభాలుగా నిలిచాయి. అలాగే విశ్వాన్ని, అందులోని మూలకాలను అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. మేధావి అనే పదానికి పర్యాయపదమైన ఐన్‌స్టీన్‌ జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • ఐన్‌స్టీన్‌ 1879, మార్చి 14న జర్మనీలోని ఉల్మ్‌లో జన్మించారు. ఐన్‌స్టీన్‌ 1896లో స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ ఫెడరల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో గణితం, భౌతికశాస్త్ర డిప్లొమా ప్రోగ్రాంలో చేరారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక స్విస్‌ పేటెంట్‌ ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడ త్వరగా పని ముగించుకుని, తన సిద్ధాంతాలను రాసుకునేవారు. 1908 వరకు అందులోనే పనిచేశారు.
  • ఐన్‌స్టీన్‌ 1905లో మూడు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. వీటితో మొత్తం విజ్ఞానశాస్త్ర తీరుతెన్నులే మారిపోయాయి. వాటిలో మొదటిది ఫొటో విద్యుత్‌ ఫలితానికి (Photoelectric Effect) సంబంధించింది. దీన్ని 1905, మార్చిలో ప్రతిపాదించారు. ఇది ఆధునిక భౌతికశాస్త్రానికి ఆధారంగా నిలిచింది. టెలివిజన్, లేజర్‌ కిరణాలకు ఈ సిద్ధాంతమే మూల కారణం. దీనికే ఆయనకు 1921లో నోబెల్‌ బహుమతి వచ్చింది.
  • రెండోది బ్రౌనియన్‌ చలనం. దీన్ని 1905, మేలో ప్రతిపాదించారు. ఇది ద్రవాల్లో పరమాణువుల చలనాన్ని వివరించింది. దీని వల్ల పరమాణువుల ఉనికి నిర్ధారణ సాధ్యమైంది. ఒక ద్రవంలో సూక్ష కణాల యాధృచ్ఛిక, అస్తవ్యస్తమైన కదలికకు ఒక గణిత నమూనాను అందించింది. ఇది పరమాణువు, అణువులు వాస్తవంగా ఉన్నాయని బలమైన రుజువు ఇచ్చింది.
  • మూడోది సాపేక్ష సిద్ధాంతం (Theory of Relativity). దీన్ని 1905, సెప్టెంబరులో వెల్లడించారు. ఈ సిద్ధాంతంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అయితే, రెండోది సామాన్య సాపేక్ష సిద్ధాంతం. ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఐన్‌స్టీన్‌ పదార్థం, శక్తి స్వరూపమని నిరూపించారు. దాని ఫలితమే పదార్థ ద్రవ్యరాశి (m), శక్తి (E) లకు ఉన్న సంబంధాన్ని తెలిపే ప్రఖ్యాత భౌతిక సమీకరణం E = mc2. 
ఐన్‌స్టీన్‌ నిర్వహించిన ఇతర ప్రయోగాలు, ఆయన రచనలు, అందుకున్న పురస్కారాలు - గౌరవాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కింది ఏ దేశంలో జన్మించారు?

(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4, 2012)

1) ఫ్రాన్స్‌      2) జర్మనీ            3) అమెరికా   4) బ్రిటన్‌

సమాధానం: 2

2. క్వాంటం గణాంకాల్లో కొత్త రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌), 2026)

1) మేఘనాథ్‌ సాహా                     2) సత్యేంద్రనాథ్‌ బోస్‌

3) ప్రశాంతచంద్ర మహలనోబిస్‌            4) జె.వి.నార్లికర్‌

సమాధానం: 2

3. 1905లో E = mc2 అనే ప్రసిద్ధ సమీకరణాన్ని ప్రతిపాదించింది?

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 2, 2024)

1) ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌                2) ఐజాక్‌ న్యూటన్‌

3) వెర్నర్‌ హైసెన్‌బర్గ్‌              4) ఎర్నెస్ట్‌ రూథర్‌ఫోర్డ్‌

సమాధానం: 1

4. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు దేన్ని కనుక్కున్నందుకు నోబెల్‌ బహుమతి లభించింది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)

1) బ్రౌనియన్‌ చలన సిద్ధాంతం        2) సాపేక్షతా సిద్ధాంతం

3) విశిష్టోష్ణ సిద్ధాంతం                4) కాంతి విద్యుత్‌ ఫలిత సిద్ధాంతం

సమాధానం: 4

5. ఐన్‌స్టీన్‌కు కింది ఏ సంవత్సరంలో నోబెల్‌ బహుమతి లభించింది?

(టీఎన్‌పీఎస్సీ గ్రూప్‌ 4, 2018)

1) 1920   2) 1921   3) 1934   4) 1945

సమాధానం: 2

6. What is a direct consequence of Einstein's Special Theory of Relativity?
(SSC Stenographer 2026)
1) Mass and energy are distinct and independently conserved.
2) Time and space are absolute quantities for all observers.
3) The speed of light is constant in all inertial frames, leading to time dilation and length contraction.
4) Gravity travels faster than light under certain conditions.
Ans: 3
7. In 1812, who described the hypothesis that equal volumes of different gases contain an equal number of molecules?  
(SSC CHSL Tier-I, 2024)
1) John Dalton        2) James Watt 
3) Amedeo Avogadro    4) Albert Einstein
Ans: 3
8. Read the following statements about the photoelectric effect:
i. The kinetic energy of emitted photoelectrons increases with increasing intensity of incident light.
ii. The photoelectric effect demonstrates the particle nature of light.
iii. There is a threshold frequency below which no photoemission occurs, regardless of light intensity.
Which of the above statements are correct?
(SSC CGL, 2025)
1) i and ii only            2) ii and iii only
3) i and iii only            4) i, ii and iii
Ans: 2
9. The photoelectric effect demonstrated that:
(SSC Stenographer, 2026)
1) Light behaves only as a wave.
2) Electrons can be created by heating metal.
3) Light energy is quantized and delivered in discrete packets, confirming the particle nature of light.
4) Energy conservation does not apply to photons.
Ans: 3


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram