ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

హోమి జహంగీర్‌ భాభా

హోమి జహంగీర్‌ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది


హోమి జహంగీర్‌ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది. స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర అణుశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు దీని ఆవశ్యకత గురించి వివరించి, అమల్లోకి వచ్చేలా చేశారు. అందుకే భారత అణుశక్తి కార్యక్రమానికి హోమి భాభాను పితామహుడిగా పేర్కొంటారు. దేశ రక్షణ రంగ బలోపేతానికి అణ్వాయుధాల తయారీని మార్గంగా ఎంచుకుని, ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం భారత్‌ అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఎదిగిందంటే ఈయన మార్గదర్శకత్వమే కారణం. భారతదేశ మొదటి విజ్ఞానశాస్త్ర పాలసీ తీర్మానంగా భావించే సైన్స్‌ పాలసీని రూపొందించారు. దేశంలో అనేక శాస్త్ర విజ్ఞాన సంస్థలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 30న హోమి జహంగీర్‌ భాభా జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం..!

  • హోమి భాభా 1909, అక్టోబరు 30న బొంబాయిలో జన్మించారు. 1927లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు ఇంగ్లండ్‌ వెళ్లిన ఆయన ప్రముఖ బ్రిటిష్‌ ఫిజిసిస్ట్‌ పాల్‌ డిరాక్‌ ప్రభావంతో సైద్ధాంతిక భౌతికశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. కాస్మిక్‌ కిరణాలు, రేడియేషన్‌ను విడుదల చేసే కిరణాలపై ప్రయోగాలు చేశారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక భాభా భారత్‌కు తిరిగి వచ్చారు.
  • నోబెల్‌ ప్రైజ్‌ విజేత సర్‌.సి.వి.రామన్‌ నాయకత్వంలో బెంగుళూరులో నడుస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో భౌతికశాస్త్ర విభాగంలో హోమి భాభా రీడర్‌గా చేరారు. అక్కడ ఆయన కాస్మిక్‌ కిరణాలు, అణు సైద్ధాంతిక భౌతికశాస్త్రంపై పరిశోధనలు చేశారు.
  • 1944లో భాభా అణ్వాయుధాలపై పరిశోధనలు చేశారు. భారత్‌ను అణుశక్తిగా మార్చేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1954లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) మొదటి కార్యదర్శి అయ్యారు. 1961-66 కాలంలో డీఏఈ ఆధ్వర్యంలో భారతదేశ అంతరిక్ష కార్యక్రమం తొలి దశలకు మార్గనిర్దేశం చేశారు. ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌ (INCOSPAR) స్థాపనకు తోడ్పడ్డారు.
  • 1930లలో హోమి భాభా ఎలక్ట్రాన్‌ ద్వారా పాజిట్రాన్‌ల స్కాటరింగ్‌కు సరైన సమీకరణాన్ని ఉత్పాదించారు. తద్వారా ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. ఈ ప్రక్రియ ‘భాభా స్కాటరింగ్‌’గా ప్రఖ్యాతిగాంచింది. 1937లో జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త వాల్టర్‌ హీట్లర్‌తో కలిసి ‘భాభా - హీట్లర్‌ థియరీ’ని అభివృద్ధి చేశారు. కాస్మిక్‌ కిరణాల జల్లుల (షవర్స్‌) ఉనికిని వివరించడంలో ఇది సాయపడింది.
  • అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ నిర్వహిస్తున్న సైంటిఫిక్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి 1966, జనవరి 24న ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో హోమి భాభా మరణించారు. ఆయన మరణానంతరం 1967లో ముంబయిలోని అటామిక్‌ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ పేరును భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బీఏఆర్‌సీ)గా మార్చారు. ఆయన పేరిట ముంబయిలో డీమ్డ్‌ యూనివర్సిటీ, సైన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.
హోమి భాభా చేసిన పరిశోధనలు - ప్రారంభించిన సంస్థలు, అందుకున్న అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత అణుకార్యక్రమ పితామహుడిగా ఎవర్ని పేర్కొంటారు?

(ఎన్‌టీపీసీ, 2021)

1) హోమీ భాభా             2) రాజా రామన్న

3) ఏపీజే అబ్దుల్‌ కలాం        4) జవహర్‌లాల్‌ నెహ్రూ

సమాధానం: 1

2. హోమి జహంగీర్‌ భాభా కింది ఏ సంస్థకు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు?

(ఐబీ ఏసీఐఓ గ్రేడ్‌ 2, 2015)

1) టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌

2) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌

3) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), బాంబే

4) సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్, కోల్‌కతా

సమాధానం: 1

3. భారతదేశ త్రిదశ అణుశక్తి కార్యక్రమాన్ని (three-stage nuclear power program) రూపొందించింది ఎవరు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) శివరామ్‌ భోజే                 2) విక్రమ్‌ సారాభాయ్‌

3) హోమి జహంగీర్‌ భాభా            4) రాజా రామన్న

సమాధానం: 3

4. 1948లో భారతదేశ అణుశక్తి కమిషన్‌ను ఎవరు స్థాపించారు?

(డబ్ల్యూబీసీఎస్‌ ప్రిలిమ్స్, 2020)

1) పి.కె.అయ్యంగార్‌                 2) ఎం.ఆర్‌.శ్రీనివాస్‌

3) విక్రమ్‌ సారాభాయ్‌               4) హోమీ భాభా

సమాధానం: 4

5. The Atomic Energy Establishment, established at Trombay in 1954, was later renamed as: 
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Indira Gandhi Atomic Centre 
2) Bhabha Atomic Research Centre
3) Indian Institute of Nuclear Science
4) Nehru Institute of Atomic Energy
Ans: 2
6. India’s three-stage nuclear programme ultimately aims to utilize:
(APSSB MTS, 2025)
1) Uranium only                2) Thorium resources
3) Coal reserves                4) Gas energy
Ans: 2
7. Who was the founding director of BARC Mumbai?
(NTPC CBT-I, 2021)
1) Homi Jehangir Bhabha        2) Vikram Sarabhai
3) Satish Dhawan                4) Raja Ramanna
Ans: 1
8. Homi Bhabha’s concept of “mimicry” suggests
(SSC GD Constable, 2026)
1) Total cultural submission
2) Colonial authority is undermined by partial imitation
3) Cultural purity
4) Violent resistance
Ans: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram