ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

హర్‌ గోబింద్‌ ఖొరానా 

ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు


ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు. ప్రోటీన్‌ సంశ్లేషణలో జన్యుకోడ్‌ పాత్రను కూడా వివరించారు. మానవ కణాల్లో డీఎన్‌ఏ విశిష్టతను తన ప్రయోగాల ద్వారా వెల్లడించారు. జన్యువుల్లోని కోడ్‌లను సమగ్రంగా వివరించినందుకు ఈయనకు వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన తెలిపిన జన్యు కోడ్‌ల ఆధారంగా జన్యువుల్లో మార్పులు చేయడం, జీవరాశుల్లో జన్యుమార్పిడి విధానాల ద్వారా అవాంఛిత లక్షణాలను తొలగించడం లాంటి ఎన్నో విధానాలు అమల్లోకి వచ్చాయి. పారిశ్రామికంగా జన్యువులను ఉత్పత్తి చేయడానికి ఈయన పరిశోధనలు వీలు కల్పించాయి. పోటీపరీక్షల కోణంలో హర్‌ గోబింద్‌ ఖొరానా జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

  • హర్‌ గోబింద్‌ ఖొరానా 1922, జనవరి 9న పంజాబ్‌లోని రాయ్‌పుర్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఖొరానా కుటుంబం దిల్లీ వచ్చి స్థిరపడింది. 1950లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధనలు చేసేందుకు ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ రసాయన శాస్త్రవేత్తలైన అలెగ్జాండర్‌ ఆర్‌ టోడ్‌ (1957లో రసాయనశాస్త్రంలో నోబెల్‌ వచ్చింది), జార్జ్‌ వాలెస్‌ కన్నర్‌తో కలిసి పనిచేశారు.
  • 1952లో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ న్యూక్లియర్‌ ఆమ్లాల ఫాస్ఫేట్‌ ఎస్టర్లపై పరిశోధనలు చేశారు. 1959 వరకు అక్కడే పనిచేశారు. 1960-70 వరకు అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. అక్కడి ఎంజైమ్‌ పరిశోధనా సంస్థలో జన్యు సంకేతం(genetic code)పై ప్రయోగాలు నిర్వహించారు.
  • జన్యు సంకేత వివరణ (Elucidation of the Genetic Code): 1950 దశకంలో అమెరికన్‌ బయో కెమిస్ట్‌ మార్షల్‌ వారెన్‌ నైరెన్‌బర్గ్‌ ప్రతిపాదించిన జెనెటిక్‌ కోడ్‌ (జన్యు సంకేతం) నమూనాను ఖొరానా ధ్రువీకరించారు. జన్యు సమాచారం డీఎన్‌ఏ నుంచి ఆర్‌ఎన్‌ఏకు, ఆపై ప్రోటీన్‌కు బదిలీ అవుతుందని నిర్ధారించారు. జన్యు సంకేతం అంటే ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ ఎలా తయారు చేయాలో కణానికి తెలిపే జన్యువులోని సూచనలు.
  • ఖొరానా ప్రయోగాలు ప్రోటీన్‌లోని ప్రతి అమైనో ఆమ్లానికి అనుగుణంగా ఉండేే ఆర్‌ఎన్‌ఏ కోడాన్‌ క్రమాలను స్థాపించడంలో సాయపడ్డాయి. జన్యు సంకేతాన్ని తెలుసుకోవడం వల్ల జెనెటిక్‌ ఇంజినీరింగ్, సింథటిక్‌ బయాలజీ రంగాల్లో విస్తృత పరిశోధనలకు మార్గం సుగమమైంది. జన్యు సంకేత వివరణ, ప్రోటీన్‌ సంశ్లేషణలో దాని పనితీరును విశ్లేషించినందుకు ఖొరానాకు 1968లో వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి లభించింది.
  • ప్రయోగశాలలో డీఎన్‌ఏను సంశ్లేషణ చేసిన మొదటి వ్యక్తిగా ఖొరానా పేరొందారు. ఆయన పరిశోధనలు బయోటెక్నాలజీ రంగంలో నూతన ఒరవడికి కారణమయ్యాయి. జన్యుపరమైన వ్యాధుల నివారణ, కొత్త వంగడాల సృష్టి మొదలైనవాటికి ఖొరానా ప్రయోగాలు కీలకంగా నిలిచాయి. ఈయన 2011, నవంబరు 9న అమెరికాలోని కాన్కార్ట్‌లో మరణించారు.

హర్‌ గోబింద్‌ ఖొరానా చేసిన ఇతర ముఖ్య పరిశోధనలు, ఆయన పొందిన అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో ఈ టాపిక్‌పై ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. హర్‌ గోబింద్‌ ఖొరానాకు కింది ఏ సంవత్సరంలో నోబెల్‌ బహుమతి లభించింది?

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఆర్‌ఐ/ ఏఆర్‌ఐ (జీకే), 2015)

1) 1962    2) 1964   3) 1966   4) 1968

సమాధానం: 4

2. కింది నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో ఎవరికి కోల్‌కతాతో ఎలాంటి సంబంధం లేదు?

(డబ్ల్యూపీఎస్సీ క్లర్క్‌షిప్, 2019)

1) మదర్‌థెరిసా            2) హెచ్‌.జి.ఖొరానా

3) సి.వి.రామన్‌            4) అభిజిత్‌ వినాయక్‌ బెనర్జీ

సమాధానం: 2

3. 1968లో హర్‌ గోబింద్‌ ఖొరానాకు ఏ విభాగంలో నోబెల్‌ బహుమతి లభించింది?

(ఎంపీ పట్వారీ, 2017)

1) భౌతికశాస్త్రం    2) వైద్యశాస్త్రం        3) రసాయనశాస్త్రం  4) ఔషధశాస్త్రం

సమాధానం: 2

4. కృత్రిమ జన్యువును ఎవరు సృష్టించారు?

(బిహార్‌ టీఆర్‌ఈ 3.0 అప్పర్‌ ప్రైమరీ (మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌), 2024)

1) అలెగ్జాండర్‌ ఒపారిన్‌                2) మేఘనాధ్ సాహా

3) హర్‌గోబింద్‌ ఖొరానా            4) ఎవరూకాదు

సమాధానం: 3

5. Nobel prize had been given to Hargovind Khorana for -
(SSC CHSL, 2019)
1) Determination of nucleic acids
2) Interpretation of the genetic code and its function in protein synthesis
3) Determination of sex
4) Determination of cells
Ans:2  
6. Har Gobind Khorana was awarded Nobel Prize in the field of ________.
(SSC MTS, 2019)
1) Medicine        2) Literature        3) Physics            4) Peace
Ans: 1
7. Name the Nobel Laureate who helped crack the genetic code.
(SSC CPO Tier- I, 2019) 
1) Venkatraman Ramakrishnan            2) Abdus Salam
3) Subramaniam Chandrasekar            4) Har Gobind Khorana
Ans: 4  
8. Which of the following is NOT a salient feature of genetic code?
(DSSSB ASO, 2025)
1) AUG has dual functions.
2) The code is nearly universal.
3) Some amino acids are coded by more than one codon.
4) The codon is quadruplet.
Ans: 4 


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram