ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జోనస్‌ సాల్క్‌

ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు


ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా పోలియోని నివారించడానికి ‘ఇనాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌ (ఐపీవీ)’ను అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచ ప్రజారోగ్యాన్ని మార్చివేసింది, 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన వైద్య విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వ్యాక్సిన్‌ ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో జోనస్‌ తన ఆవిష్కరణకు పేటెంట్‌ కూడా తీసుకోలేదు. ఫలితంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో పోలియోను సమూలంగా నిర్మూలించగలిగారు. అక్టోబరు 28న జోనస్‌ సాల్క్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • జోనస్‌ సాల్క్‌ 1914, అక్టోబరు 28న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించారు. పూర్తి పేరు జోనస్‌ ఎడ్వర్డ్‌ సాల్క్‌. 1942లో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు మిచిగాన్‌ యూనివర్సిటీకి రిసెర్చ్‌ ఫెలోగా వెళ్లిన జోనస్‌ అక్కడ థామస్‌ ఫ్రాన్సిస్‌ జూనియర్‌తో కలిసి దానిపై పరిశోధనలు చేశారు. గతంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ నిర్మూలనకు కనుక్కున్న ఔషధం ఆధారంగా మరిన్ని ప్రయోగాలు చేసి, చివరకు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశారు. 
  • పోలియో వ్యాధి పోలియో వైరస్‌ వల్ల సంభవిస్తుంది. సాధారణంగా అయిదేళ్లలోపు పిల్లలకు ఇది ఎక్కువగా సోకుతుంది. దీన్నే శిశు పక్షవాతం అని కూడా అంటారు.  ఒకసారి సోకాక పోలియో పూర్తిగా నయం కాదు. 20వ శతాబ్దం మధ్యలో ఏటా లక్షల మంది పిల్లలు దీని బారినపడటాన్ని జోనస్‌ సాల్క్‌ గుర్తించారు. దీనిపై పరిశోధన చేయాలని ఆయన భావించారు.
  • 1952లో చనిపోయిన వైరస్‌ను కోతి శరీరంలోకి ప్రవేశపెట్టగా, యాంటీబాడీలు ఏర్పడటాన్ని జోనస్‌ గమనించారు. తర్వాత మనుషులపై ప్రయోగాలు చేశారు. సాల్క్‌ కనిపెట్టిన వ్యాక్సిన్‌ సూది ద్వారా మానవ శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసినప్పుడు ప్రభావవంతంగా పనిచేసినట్లు 1954లో గుర్తించారు. 1955, ఏప్రిల్‌ 12న అమెరికాలో దీన్ని విడుదల చేశారు.
  • 1952లో అమెరికాలో సుమారు 58 వేలకు పైగా పోలియో కేసులు, 3 వేల కంటే ఎక్కువ మరణాలు నమోదవగా, సాల్క్‌ వ్యాక్సిన్‌ విడుదలయ్యాక 1962లో పోలియో కేసుల సంఖ్య 910కి తగ్గింది. 1988లో ప్రపంచవ్యాప్తంగా 350000 పోలియో కేసులు నమోదుకాగా, 2007లో ఆ సంఖ్య 1625గా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.
  • అమెరికాలో చిట్టచివరి పోలియో కేసు 1979లో నమోదైంది. 1994 నాటికి దీన్ని ఆ దేశం నుంచి పూర్తిగా నిర్మూలించారు. ప్రస్తుతం నైజీరియా, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌లో పోలియో సాంక్రమిక వ్యాధిగా కొనసాగుతోంది. మన దేశంలో చివరగా 2011లో పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పోలియో కేసు నమోదైంది. డబ్ల్యూహెచ్‌ఓ 2014, మార్చిలో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది.
  • సాల్క్‌ వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసి ప్రజల వ్యాధులను నయం చేయడం కంటే ఆ వ్యాధి మూలాలను కనిపెట్టి పూర్తిగా దాన్ని నివారించాలని భావించారు. పోలియో వ్యాక్సిన్‌ కనుక్కోవడం ఒక్కటే ఆయన సాధించిన విజయం కాదు. ఎయిడ్స్‌ వ్యాక్సిన్లపై పరిశోధన, క్యాన్సర్‌ చికిత్స ప్రయోగాలు మొదలైనవి తర్వాతి తరాలకు మార్గదర్శకంగా నిలిచాయి. సాల్క్‌ 1995 జూన్‌ 23న కాలిఫోర్నియాలో మరణించారు.

జోనస్‌ సాల్క్‌ చేసిన రచనలు, అందుకున్న అవార్డులు ఇతర ముఖ్య సమాచారంతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మోతాదులో ఎన్ని చుక్కల ఓపీవీ వ్యాక్సిన్‌ వేయాలని సిఫార్సు చేసింది?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) నాలుగు    2) మూడు        3) రెండు     4) ఒకటి

సమాధానం: 3

2. పోలియో వ్యాధి ప్రధానంగా కింది ఏ శరీర భాగాలపై ప్రభావాన్ని చూపుతుంది?

(యూకేపీఎస్సీ జేఈ, 2013)

1) గుండె, వెన్నుపాము              2) మెదడు, వెన్నుపాము

3) మెదడు, ఎముకలు              4) మెదడు, గుండె

సమాధానం: 2

3. పోలియో వ్యాక్సిన్‌ను కింది ఎవరు కనుక్కున్నారు?

(వెస్ట్‌ బెంగాల్‌ పోలీస్‌ ఎస్‌ఐ, 2018),

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌ లెవల్‌), 2026)

1) కాన్రాడ్‌ జ్యూస్‌                2) జోనస్‌ సాల్క్‌

3) లూయిస్‌ పాశ్చర్‌            4) ఎలీ విట్నీ

సమాధానం: 2

4. పోలియో కింది దేనివల్ల సంభవిస్తుంది?

(గుజరాత్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ (లోక్‌రక్షక్‌), 2019)

1) వైరస్‌     2) బ్యాక్టీరియా        3) ఫంగస్‌    4) దోమ

సమాధానం: 1

5. Which of the following is an inactivated (killed) polio vaccine developed in 1952?
(SSC CGL Tier-I, 2024)
1) Salk vaccine        2) Imvanex vaccine
3) HDCV vaccine        4) TAB vaccine
Ans: 1
6. With reference to Polio, consider the following statements
i. Polio is transmitted through the faecal-oral route.
ii. India is not yet declared polio-free.
Which of the statements given above is/are CORRECT?
(RRB JE CBT-I, 2019)
1) i only        2) ii only        3) Both i and ii        4) Neither i nor ii
Ans: 1
7. Which polio vaccine is more useful in controlling epidemics?
(SSC MTS, 2021)
1) IPV        2) OPV        3) Fractional IPV        4) None
Ans: 2 
8. In March 2025, which health milestone was remembered on National Vaccination Day?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Launch of COVID Vaccine            2) National Vax Mission
3) Pulse Polio First Dose                4) Polio Eradication Drive
Ans: 3


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram