ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

మైఖేల్‌ ఫారడే 

ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్‌ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు


ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం (selectromagnetismz), విద్యుత్‌ రసాయనశాస్త్రం (electrochemistry) రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు. విద్యుదయస్కాంత ప్రేరణ (electromagnetic induction) నియమంతోపాటు ఎలక్ట్రిక్‌ మోటార్, డైనమోను కనుక్కున్నారు. బెంజీన్‌ సహా అనేక కొత్త కర్బన సమ్మేళనాలను గుర్తించారు. విద్యుత్, రసాయన బంధం మధ్య సంబంధాన్ని నిరూపించారు. కాంతిపై అయస్కాంతత్వం ప్రభావాన్ని కనుక్కున్నారు. అయస్కాంత పదార్థాలను విభజించారు. ఈయన ప్రయోగాలు ఆధునిక భౌతిక, రసాయనశాస్త్రాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. ఆగస్టు 25న ఫారడే వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

  • మైఖేల్‌ ఫారడే 1791, సెప్టెంబరు 22న లండన్‌ దగ్గర్లోని న్యూవింగ్టన్‌ బట్స్‌ అనే గ్రామంలో జన్మించారు. 1813లో రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో హంఫ్రీ డేవీకి సహాయకుడిగా చేరిన ఫారడే అనేక ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. 1825లో రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రయోగశాలకు డైరెక్టర్‌ అయ్యారు. 1820లో ఫారడే మొదటి కార్బన్‌ - క్లోరిన్‌ సమ్మేళనాలుగా హెక్సాక్లోరోఈథేన్, టెట్రాక్లోరోఈథీన్‌లను కనుక్కున్నారు.
  • 1821లో ఎలక్ట్రోమాగ్నటిక్‌ రొటేషన్‌ను కనుక్కుని, విద్యుత్‌ మోటారు తొలి రూపాన్ని నిర్మించారు. 1823లో వాయువుల ద్రవీకరణ, వాటి శీతలీకరణ (Liquefaction of gases and their refrigeration)పై ప్రయోగాలు చేశారు. క్లోరిన్, ఇతర వాయువులను విజయవంతంగా ద్రవీకరించారు. 1825లో బెంజీన్‌ను కనుక్కున్నారు. 1831లో ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ (electromagnetic induction) నియమాన్ని ఆవిష్కరించారు. 
  • ఫారడే 1833లో విద్యుద్విశ్లేషణ నియమాలు (laws of electrolysis) రూపొందించారు. అలాగే పదార్థాన్ని విద్యుత్‌ విశ్లేషణ (Electrolysis) చేసి పరమాణువును ఇంకా చిన్న కణాలుగా విభజించవచ్చని తెలిపారు. తర్వాతి కాలంలో వివిధ శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా పరమాణువును చిన్న కణాలుగా విభజించారు. 1836లో బాహ్య విద్యుత్‌ క్షేత్రాల నుంచి రక్షణ కల్పించే ‘ఫారడే కేజ్‌’ను కనుక్కున్నారు. 

అవార్డులు - గౌరవాలు

  1. 1824లో రాయల్‌ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పాలనాపరమైన బాధ్యతల నుంచి స్వతంత్రంగా ఉండటమే ముఖ్యమని భావించిన ఆయన రాయల్‌ సొసైటీ అధ్యక్ష పదవిని రెండుసార్లు తిరస్కరించారు.
  2. 1832లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో విదేశీ సభ్యులుగా నియమితులయ్యారు.
  3. 1833లో రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి ఫుల్లెరియన్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ అయ్యారు.
  4. 1838లో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  5. 1844లో ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు ఎన్నికైన 8 మంది విదేశీ సభ్యుల్లో ఆయన ఒకరు.

ప్రముఖ రచనలు

ఫారడే తన జీవితకాలంలో ప్రధానంగా రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, విద్యుత్‌పై దృష్టిసారిస్తూ అనేక ముఖ్యమైన శాస్త్రీయ పుస్తకాలు, ఉపన్యాస సంకలనాలు రచించారు. వాటిలో కొన్ని..

  • కెమికల్‌ మానిప్యులేషన్‌ (1827)
  • ఎక్స్‌పరిమెంటల్‌ రిసెర్చెస్‌ ఇన్‌ ఎలక్ట్రిసిటీ: 3 వాల్యూమ్స్‌ (1839-55)
  • ఎక్స్‌పరిమెంటల్‌ రిసెర్చెస్‌ ఇన్‌ కెమిస్ట్రీ అండ్‌ ఫిజిక్స్‌ (1859)
  • ఎ కోర్స్‌ ఆఫ్‌ సిక్స్‌ లెక్చర్స్‌ ఆన్‌ ది కెమికల్‌ హిస్టరీ ఆఫ్‌ కాండిల్‌ (1861)
  • ఆన్‌ ది వేరియస్‌ ఫోర్సెస్‌ ఆఫ్‌ నేచురల్‌ అండ్‌ దెయిర్‌ రిలేషన్స్‌ టు ఎర్త్‌ అదర్‌ (1860)

మైఖేల్‌ ఫారడే ఆవిష్కరణలు, ప్రయోగాలు ఆధునిక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌కు మార్గం సుగమం చేశాయి. ఆయన ఎలక్ట్రోమాగ్నటిక్‌ ఇండక్షన్‌ను కనిపెట్టి అయస్కాంత శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చవచ్చని నిరూపించారు. నిత్యం మనం ఉపయోగిస్తున్న ఆల్టర్నేటింగ్‌ కరెంట్, ఎలక్ట్రిక్‌ జనరేటర్, డైనమోలను తయారు చేసి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ’గా పేరొందారు. ఆయన 1867, ఆగస్టు 25న బ్రిటన్‌లోని మోల్సీలో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మైఖేల్‌ ఫారడే కింది ఏ సంవత్సరంలో బెంజీన్‌ను కనుక్కున్నారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2023)

1) 1820   2) 1827   3) 1822  4) 1825

సమాధానం: 4

2. ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ను ఎవరు కనుక్కున్నారు?

(డబ్ల్యూబీసీఎస్సీ ఫుడ్‌ ఎస్‌ఐ, 2014)

1) సర్‌ అలెగ్జాండర్‌ గ్రహం బెల్‌        2) మైఖేల్‌ ఫారడే

3) ఆల్ఫ్రెడ్‌ బి నోబెల్‌                4) థామస్‌ ఆల్వా ఎడిసన్‌

సమాధానం: 2

3. మైఖేల్‌ ఫారడే కింది దేన్ని కనుక్కున్నారు?

(డబ్ల్యూబీఎస్‌ఈటీసీఎల్‌ జేఈ గ్రేడ్‌ 2 ఎలక్ట్రికల్, 2016)

1) విద్యుదయస్కాంతత్వం            2) బెంజీన్‌

3) విద్యుత్‌ ప్రవాహ ప్రేరణ             4) పైవన్నీ

సమాధానం: 4

4. ఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్‌ పనితీరుకు ఆధారమైన విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రాన్ని మైఖేల్‌ ఫారడే ఎప్పుడు కనుక్కున్నారు? 

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2025)

1) 1853    2) 1831   3) 1820   4) 1875

సమాధానం: 2

5. Who was the scientist credited with the discovery of electromagnetic induction?
(RRB JE CBT-I, 2024)
1) Thomas Edison             2) Isaac Newton         
3) Michael Faraday        4) Nikola Tesla
Ans: 3
6. Who among the following introduced the concept of electric field for the first time?
(SSC CHSL, 2021)
1) Blaise Pascal                    2) Michael Faraday
3) Charles Augustin de Coulomb        4) Joseph Henry
Ans: 2
7. Which famous experiment was done by Michael Faraday in 1831?
(SSC CGL Tier-I, 2024)
1) Discovery of quantum magnetometers
2) Discovery of law of elasticity
3) Discovery of electromagnetic induction
4) Discovery of natural radioactivity
Ans: 3
8. "Electric Generator" was invented by _______ and he was from _______.
(Rajasthan Police Constable, 2022)
1) Alessandro Volta, Italy            2) Thomas Alva Edison, USA
3) Alfred Nobel, Sweden            4) Michael Faraday, England
Ans: 4


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram