ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

రాజా రామన్న 

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు. దీని ఫలితంగానే 1974లో భారత్‌ తన మొదటి అణు పరీక్ష ‘స్మైలింగ్‌ బుద్ధ’ నిర్వహించింది. ఆయన ప్రయోగాలు అణు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి పునాదిగా నిలిచాయి. భారత్‌ను అణ్వాయుధాలు కలిగిన దేశాల సరసన నిలపడంలో ఈయన శ్రమ ఎంతగానో ఉంది. పోటీ పరీక్షల కోణంలో రాజా రామన్న జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • రాజా రామన్న 1925, జనవరి 28న బ్రిటిష్‌ ఇండియాలోని మైసూరు సంస్థానంలో ఉన్న టిప్టూర్‌లో (ప్రస్తుతం కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉంది) జన్మించారు
  • మైసూర్‌లోని దల్వాయ్‌ స్కూల్, గుడ్‌షెపర్డ్‌ కాన్వెంట్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఉన్నత విద్య కోసం బెంగళూరులోని బిషప్‌కాటన్‌ బాయ్స్‌ స్కూల్‌లో చేరారు. చిన్నతనంలో ఆయనకు సంగీతంపై ఎక్కువ ఆసక్తి ఉండేది
  • బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు
  • తర్వాత భౌతికశాస్త్రాన్ని అభ్యసించేందుకు 1942లో ఆయన తాంబరంలోని మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చేరారు. అప్పటివరకు సంగీతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రామన్నకు కాలేజీలో చేరాక ఫిజిక్స్‌పై ఆసక్తి పెరిగింది. ప్రముఖ జర్మన్‌-అమెరికన్‌ భౌతికశాస్త్రవేత్త ‘రివ్యూస్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఫిజిక్స్‌’ అనే పత్రికలో రాసిన వ్యాసం ద్వారా ఆయన అణు భౌతికశాస్త్ర రంగం గురించి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇదే విప్లవాత్మక రంగంగా మారుతుందని రామన్న అప్పుడే గ్రహించారు.
  • 1944లో ఆయన డాక్టర్‌ హోమీ జహంగీర్‌ భాభాను కలిశారు. అప్పటి వరకు భౌతికశాస్త్రంపై ఆయనకున్న ఆలోచనా పరిధి మరింత విస్తృతమైంది
  • 1945లో బీఎస్సీ ఫిజిక్స్‌లో పట్టభద్రుడయ్యాక ఫిజిక్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) చేసేందుకు బొంబాయి యూనివర్సిటీలో చేరారు. 1947లో పట్టా అందుకున్నారు. తర్వాత విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆయనకు జె.ఎన్‌.టాటా ఎండోమెంట్‌ నుంచి స్కాలర్‌షిప్‌ లభించింది. దాని సాయంతో ఆయన లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో భౌతికశాస్త్రంలో డాక్టరేట్‌ కోసం వెళ్లారు. అయనీకరణ కణాలు (ionizing particles), విచ్ఛిత్తి శకలాల (fission fragments) కోణీయ పంపిణీపై అధ్యయనం చేశారు. దీనివల్ల ఆయనకు న్యూట్రాన్‌ ఫిజిక్స్, రియాక్టర్‌ డిజైన్‌పై అవగాహన ఏర్పడింది. 1949లో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అదే ఏడాది భారత్‌కు తిరిగివచ్చి, హోమీ భాభా పిలుపు మేరకు ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)లో రిసెర్చర్‌గా చేరారు. అణు విచ్ఛిత్తి, న్యూట్రాన్‌ స్కాటరింగ్, రియాక్టర్‌ ఫిజిక్స్‌పై తన ప్రాథమిక పరిశోధన ప్రారంభించారు.
రామన్న చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు, నిర్వహించిన కీలక పదవులు, పొందిన అవార్డులు - గౌరవాలు తదితర పూర్తి సమాచారంతోపాటు ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ,  ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల్లో అడిగిన  ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సులో  అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశ మొదటి అణుపరీక్ష కింది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) సతీష్‌ ధావన్‌             2) రాజా రామన్న

3) విక్రమ్‌ సారాభాయ్‌         4) ఎస్‌ఎస్‌ భట్నాగర్‌

సమాధానం: 2

2. 1974లో భారతదేశంలో మొదటి అణుపరీక్ష ఎక్కడ జరిగింది?

(బీఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ (మెయిన్స్‌), 2016)

1) ముంబయి        2) పోఖ్రాన్‌        3) దిల్లీ             4) శ్రీహరికోట

సమాధానం: 2

3. Consider the followings about Raja Ramanna:

a) He had directed the team of scientists which carried out the test of a nuclear device.

b) He was awarded by Padma Vibhushan in 1976.

c) He was made Union Minister of State for Defence in 1990.

d) He had written a book entitled ‘The Structure of Music in Raga and Western System’.
Select the correct answer by using the code given below:
(RPSC RAS Prelims 2015)

1) (a) and (b)          2) (a), (b) and (c)

3) (d) only            4) (a), (b), (c) and (d)

Ans: 3

4. Which of the following scientist have no contribution in the Nuclear field in India?
(NTPC CBT-I, 2021)

1) Homi J Bhabha        2) Sekhar Basu

3) Raja Ramanna         4) C N R Rao

Ans: 4

5. Who was the founding director of BARC Mumbai?
(NTPC CBT-I, 2021)

1) Homi Jehangir Bhabha        2) Vikram Sarabhai

3) Satish Dhawan             4) Raja Ramanna

Ans: 1


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram