విద్యార్థులు, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం. చిన్నతనం నుంచే వారు విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, విలువలు, జ్ఞానం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 5న మన దేశంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (Teacher's Day) నిర్వహిస్తారు. మన జీవితాలకు మార్గదర్శిగా నిలిచే అమూల్యమైన గురువుల పాత్రను గుర్తుంచుకోవడంతోపాటు వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
రాధాకృష్ణన్ 1888, సెప్టెంబరు 5న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో జన్మించారు. 1962లో ఆయన రాష్ట్రపతి అయ్యాక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు చాలామంది వచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజును దేశంలోని ఉపాధ్యాయులను గౌరవించేందుకు అంకితం చేయాలని అభ్యర్థించారు. దీనికి స్పందించిన భారత ప్రభుత్వం సెప్టెంబరు 5ను ఏటా మన దేశంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది.
|
సమగ్ర శిక్షా అభియాన్, దీక్షా ప్లాట్‌ఫాం, నిష్ఠ స్కీం, ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యలో చేపట్టిన సంస్కరణలు, నూతన కార్యక్రమాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్-3, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున కిందివాటిలో దేన్ని జరుపుకుంటారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)
1) రాజ్యాంగ దినోత్సవం 2) విద్యార్థుల దినోత్సవం
3) ఇంజినీర్ల దినోత్సవం 4) ఉపాధ్యాయ దినోత్సవం
సమాధానం: 4
2. భారతదేశంలో నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్ ఎవరి పేరు మీద ప్రారంభమైంది?
(జీఎస్‌ఈటీ, 2018)
1) పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 2) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
3) పండిట్ మదన్ మోహన్ మాలవీయ 4) పండిట్ రవిశంకర్
సమాధానం: 3
3. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఎప్పుడు ఏర్పాటైంది?
(యూజీసీ నెట్, 2022)
1) 1992, ఆగస్టు 17 2) 1994, ఆగస్టు 17
3) 1995, ఆగస్టు 17 4) 1996, ఆగస్టు 17
సమాధానం: 3
4. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా ఏ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు?
(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్, 2024)
1) 1954 2) 1951 3) 1952 4) 1950
సమాధానం: 3
5. What is the full form of 'DIKSHA'?
(UGC NET, 2023)
1) Digital Infrastructure for Knowledge Sharing
2) District Institute for Knowledge Sharing
3) Data Information and Knowledge Sharing
4) Digital Institution for Knowledge Sharing
Ans: 1
6. NISHTHA stands for ____________
(SSC MTS, 2024)
1) National Initiative for School Heads' and Teachers' Holistic Assessment
2) National Inauguration for School Heads' and Teachers' Holistic Advancement
3) National Initiative for School Heads' and Teachers' Holistic Advancement
4) National Inauguration for School Heads' and Teachers' Holistic Assessment
Ans: 3
7. The first on-line NISHTHA programme has been launched by the Ministry of Human Resource Development in _______.
(RRB NTPC CBT-I, 2021)
1) Andhra Pradesh 2) Maharashtra 3) Delhi 4) Uttar Pradesh
Ans: 1
8. In India, Teachers' Day is celebrated annually on September 5 to mark the birthday of:
(SSC CGL, 2024)
1) A.P.J Abdul Kalam 2) Sardar Vallabhbhai Patel
3) Sarvepalli Radhakrishnan 4) Subash Chandra Bose
Ans: 3