భారతదేశ పారిశ్రామిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. ఇవి స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలకం. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ, చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాయి. అంతేకాక కొత్త ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఉపాధి కల్పనలో, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు సంస్కృతిని కాపాడటంలో చిన్నతరహా పరిశ్రమలు పోషిస్తోన్న పాత్రను గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 30న మన దేశంలో ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా (National Small Industry Day) నిర్వహిస్తారు. దేశంలోని వైవిధ్యభరిత పారిశ్రామిక రంగంలో ఆవిష్కరణ, సంప్రదాయం, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించడంలో వీటి చొరవను ప్రశంసించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
దేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం 2000, ఆగస్టు 30న ఒక సమగ్ర విధాన ప్యాకేజీని ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక అభివృద్ధి, చెల్లింపుల విధానంలో సమస్యలను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని 2001 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.
| చిన్న పరిశ్రమల వల్ల ఆయా రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, దేశంలో వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-1 మెయిన్స్, ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ ఈ అంశంపై అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు-II’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీ ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్, 2024), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022),(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్ట్ గార్డ్, 2024),
1) ఆగస్టు 25 2) ఆగస్టు 23
3) ఆగస్టు 30 4) ఆగస్టు 31
సమాధానం: 3
2. కింది ఎంత మొత్తంలో గరిష్ఠ ఆస్తులు కలిగిన సంస్థలను చిన్నతరహా పరిశ్రమగా పేర్కొంటారు?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2023)
1) రూ.5 లక్షలు 2) రూ.కోటి
3) రూ.10 లక్షలు 4) రూ.10 కోట్లు
సమాధానం: 4
3. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ను భారతదేశంలో కింది ఏ సంవత్సరంలో స్థాపించారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్ లెవల్), 2026)
1) 1954 2) 1982 3) 1955 4) 1975
సమాధానం: 3
4. కిందివాటిలో చిన్నతరహా పరిశ్రమ ఏది?
(బిహార్ ఎస్‌టెట్ టీజీటీ (సోషల్ సైన్స్), 2023)
1) చక్కెర పరిశ్రమ 2) కాగజ్ పరిశ్రమ
3) బొమ్మల పరిశ్రమ 4) ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ
సమాధానం: 3
5. Small-scale industries in India in 1950 were defined as all those industries in which the maximum investment amounted to:
(SSC Stenographer, 2024)
1) 5 lakh 2) 7 lakh 3) 8 lakh 4) 6 lakh
Ans: 1
6. Which policy gave a major thrust to small-scale industries?
(SSC GD Constable, 2026)
1) 1948 Industrial Policy 2) 1956 Industrial Policy
3) 1977 Industrial Policy 4) 1980 Industrial Policy
Ans: 3
7. Pradhan Mantri Mudra Yojana comes under which of the following?
i. Ministry of Corporate Affairs
ii. Ministry of Rural Development
iii. Ministry of Finance
Select the correct answer from the code given below:
(UPPSC PCS, Paper-I Prelims, 2025)
1) Only i 2) ii and iii 3) Only iii 4) i and ii
Ans: 3
8. Which of the following categories of MSMEs constitutes the major share of MSME registration on the Udyam Registration Portal?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Large 2) Micro 3) Small 4) Medium
Ans: 2