శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉత్సాహానికి క్రీడలు ఎంతో అవసరం. మెరుగైన ఆరోగ్యం, సామాజిక సమైక్యత, లింగ సమానత్వం, ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ సహకారాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి. అందుకే చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతోపాటు ఆటల ప్రాముఖ్యాన్ని కూడా తెలపాలి. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఈ మేరకు చర్యలు చేపట్టాలి. భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మన దేశంలో ఏటా ఆగస్టు 29న ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా (National Sports Day) నిర్వహిస్తారు. దీన్నే ‘రాష్ట్రీయ ఖేల్ దివస్’ అని కూడా అంటారు. వ్యక్తి జీవితంలో క్రీడలు పోషించే పాత్ర గురించి అవగాహన కల్పించడం, వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఖేలో ఇండియా
చారిత్రక నేపథ్యం
| స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ క్రీడా పురస్కారాలు, ధ్యాన్‌చంద్ జీవిత విశేషాలతోపాటు టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు-II’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మేజర్ ధ్యాన్‌చంద్ భారతదేశంలోని కింది ఏ నగరంలో జన్మించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)
1) అలీఘర్ 2) లఖ్‌నవూ
3) అలహాబాద్ 4) దెహ్రాదూన్
సమాధానం: 3
2. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం?
(ఎంపీ పట్వారీ, 2017)
1) భారత్ మొదటి ఓడీఐ ప్రపంచకప్ గెలవడం
2) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన
3) హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజు కావడం
4) భారత్ మొదటి ఒలింపిక్ పతకం గెలిచిన రోజు
సమాధానం: 3
3. క్రీడల ఉద్దేశం ఏమిటి?
(బిహార్ ఎస్‌టెట్ టీజీటీ (ఇంగ్లిష్), 2023)
1) శారీరక వికాసం 2) నైతిక వికాసం
3) 1, 2 4) ఏదీకాదు
సమాధానం: 3
4. ఖేలో ఇండియా కార్యక్రమంలో ఎన్ని విభాగాలు/ అంశాలు ఉన్నాయి?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, 2022)
1) 18 2) 14 3) 16 4) 12
సమాధానం: 4
5. Sports Authority of India, the apex body for sports promotion, was set up in the year __________.
(SSC CGL Tier-I, 2023)
1) 1990 2) 1961 3) 1984 4) 1982
Ans: 3
6. The famous Dhyan Chand Award is given for:
(Delhi Police Head Constable (Ministerial), 2026)
1) Excellence in international coaching
2) Lifetime achievement in sports
3) Best debutant sportsperson
4) Junior sports talent
Ans: 2
7. When was the Retired Sportsperson Empowerment Training (RESET) Programme officially launched by the Ministry of Youth Affairs and Sports?
(RRB Group D, 2025)
1) 2022 2) 2024 3) 2023 4) 2025
Ans: 2
8. Which new initiative was launched by the government on National Sports Day 2024?
(RRB Technician Grade III, 2024)
1) National Sports Scholarship Scheme
2) Retired Sportsperson Empowerment Training (RESET) Programme
3) Fit India Movement
4) National Fitness Challenge
Ans: 2