కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను రోజువారీ పనుల్లో ప్రభావవంతంగా అమలు చేయడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలిచినట్లు మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ‘వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026’ వెల్లడించింది. ప్రపంచంలోని 10 ప్రధాన మార్కెట్ల (అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రెజిల్)లో పరిశోధన చేయగా.. అత్యధిక స్థాయిలో ఫ్రంటియర్ ప్రొఫెషనల్స్ ఉన్న దేశంగా భారత్ నిలిచినట్లు పేర్కొంది.
మన దేశంలోని ఏఐ వినియోగదారుల్లో 32% మంది సంక్లిష్ట మల్టీ-స్టెప్ వర్క్‌ఫ్లోస్‌లో ఏఐ ఏజెంట్‌లను వినియోగిస్తూ, పనితీరును పూర్తిగా పునర్నిర్నించుకుంటున్నారు. అంతర్జాతీయ సగటు (16%) కంటే ఇది రెట్టింపు.