ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక

ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక

నేపాల్‌లోని కాఠ్‌మాండూ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌(ఐసీఐఎంఓడీ) హిందూకుష్‌ హిమాలయాలపై ఇటీవల పరిశోధన నివేదిక వెలువరించింది. హిందూకుష్‌ హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే 24 కోట్ల మందితోపాటు దిగువన దాదాపు 175 కోట్ల మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను హిమానీనద సరస్సులే(గ్లేసియర్‌ లేక్స్‌) తీరుస్తున్నాయని పేర్కొంది. గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి 12 ‘ఆసియా వాటర్స్‌’ నదుల ద్వారా ప్రజల ఆహారభద్రతతోపాటు జలవిద్యుత్‌ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. అటువంటి హిమానీనదాలు వేగంగా కరుగుతుండటంతో భవిష్యత్తుపై ఆందోళనలు కమ్ముకుంటున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram