మిషిగన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం

మిషిగన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం

పారిశ్రామిక యుగానికి పూర్వం కంటే ఎల్‌ నినో ఘటనలు గత 40 ఏళ్లలో సుమారు 40 శాతం తీవ్రతరమయ్యాయని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం తేల్చింది. భూతల, సముద్రతల ఉష్ణోగ్రతలు పెరగడానికీ, వరదలు, అనావృష్టి లాంటి విపత్తులకు ఎల్‌ నినో కారణమవుతుంది. దక్షిణ అమెరికాలో ఈక్వెడార్‌ దేశ తీరానికి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న గాలాపాగోస్‌ దీవులలో ఆధునిక, పురాతన పగడపు దిబ్బలను పరిశోధక బృందం పరిశీలించింది. పరిశోధకులు గాలాపాగోస్‌ దీవుల నుంచి 13 ఆధునిక, పురాతన పగడాల నమూనాలను సేకరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram