సర్లా ఏవియేషన్‌తో టాటా ఎలెక్సీ ఒప్పందం

సర్లా ఏవియేషన్‌తో టాటా ఎలెక్సీ ఒప్పందం

బెంగళూరుకు చెందిన అంకురం సర్లా ఏవియేషన్‌ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి కోసం డిజైన్, సాంకేతిక సేవల సంస్థ టాటా ఎలెక్సీ చేతులు కలిపింది. ఈ ఎయిర్‌ ట్యాక్సీ రూపకల్పన, తయారీలో పరస్పరం సహకరించుకునేందుకు రెండు సంస్థలూ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా ఎలెక్సీ ఏవియానిక్స్, ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వెరిఫికేషన్, వాలిడేషన్‌ సర్టిఫికేషన్‌ అంశాల్లో సమగ్ర ఇంజినీరింగ్‌ మద్దతు అందిస్తుంది. దీంతోపాటు సెన్సర్‌ ఫ్యూజన్‌ ఆధారిత నేవిగేషన్‌ సాంకేతికత, పరీక్షల సేవలనూ అందించనుంది. మరోవైపు శూన్య ప్లాట్‌ఫామ్‌ డిజైన్, అభివృద్ధి, టైప్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియలకు సర్లా ఏవియేషన్‌ నేతృత్వం వహిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram