జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

దేశవ్యాప్తంగా 2026, ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,99,853 కోట్లుగా నమోదయ్యాయి. 2025, ఆగస్టుతో పోలిస్తే ఇవి 14.8% అధికం. దేశీయ లావాదేవీల ద్వారా రూ.1,37,249 కోట్లు (9.3% వృద్ధి), దిగుమతుల ద్వారా రూ.62,604 కోట్ల (29% వృద్ధి) జీఎస్‌టీ ఆదాయం వచ్చింది. మొత్తం వసూళ్లలో కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.38,413 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.46,316 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.1,15,124 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్‌ల కింద రూ.31,795 కోట్లు (67.9% వృద్ధి) చెల్లించారు. దీంతో నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1,68,057 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలోని నికర జీఎస్‌టీ వసూళ్లతో పోలిస్తే ఇది 8.3% ఎక్కువ.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram