మహిళల క్రికెట్లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ.. శ్రీలంక నుంచి భారత్‌కు తరలించింది. ముందు అనుకున్న ప్రకారం 2027లో జరిగే ఈ టోర్నీకి లంక ఆతిథ్యం ఇవ్వాలి. కానీ ఆ దేశ క్రికెట్ పాలనా సమస్యలతో సతమతమవుతుండటంతో టోర్నీని మరో దేశంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలించిన ఐసీసీ చివరకు ఆతిథ్య హక్కులను ఇండియాకు అప్పగించింది.
2027, ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముంబయి, వదోదరాలను వేదికలుగా ఖరారు చేశారు.