స్విట్జర్లాండ్‌కు చెందిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. న్యూపోర్ట్ (అమెరికా)లో జరిగిన కార్యక్రమంలో ఫెదరర్ హాల్ ఆఫ్ ఫేమ్ ట్రోఫీని అందుకున్నాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన ఫెదరర్.. ఒక దశలో వరుసగా 237 వారాలు ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగాడు.
ఫెదరర్‌తో పాటు అమెరికా మాజీ క్రీడాకారిణి మేరీ కారిలో కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకుంది.