భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో 15-13తో ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. 2026 ఆరంభంలో నార్వే చెస్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన అతడు.. ఇప్పుడు గ్రాండ్ చెస్ టూర్‌ను దక్కించుకున్న భారత తొలి గ్రాండ్ మాస్టర్‌గానూ ఘనత అందుకున్నాడు.
2026, ఆగస్టు 28న సెయింట్ లూయిస్‌లో జరిగిన ఫైనల్లో ప్రజ్ఞ ఛాంపియన్‌గా అవతరించాడు. రూ.1.91 కోట్లు నగదు బహుమతి అందుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞ 2027లో జరిగే గ్రాండ్ చెస్ టూర్‌లో స్థానం ఖరారు చేసుకున్నాడు.