ముచోవా జోడీకి మిక్స్‌డ్‌ టైటిల్‌

ముచోవా జోడీకి మిక్స్‌డ్‌ టైటిల్‌

యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను కరోలినా ముచోవా, జాకబ్‌ మెన్సిచ్‌ జోడీ దక్కించుకుంది. ఫైనల్లో ఈ జంట 6-3, 1-6, 10-6తో బెలిండా బెన్సిచ్, ఫ్లావియో కొబొలి ద్వయంపై విజయం సాధించింది. ముచోవా జంటకు రూ.9.5 కోట్ల నగదు బహుమతి లభించింది. సెమీఫైనల్లో ఈ జోడీ 5-4, 3-5, 11-9తో మిరా ఆండ్రీవా, ఆండ్రె రుబ్లెవ్‌ ద్వయంపై గెలిచింది. యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు ముందు ఈ మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలను నిర్వహించడం గతేడాది నుంచే ప్రారంభించారు. సెరెనా విలియమ్స్, అల్కరాస్‌ జంట క్వార్టర్స్‌లో నిష్క్రమించగా, అర్యానా సబలెంకా, నొవాక్‌ జకోవిచ్‌ జోడీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram