దేశంలో 2026-27 ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు 28వ తేదీ నాటికి సాగు విస్తీర్ణం 18.91% తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ 2026, ఆగస్టు 31న పేర్కొంది. ఇందులో అత్యధికంగా వరిసాగు విస్తీర్ణం 14.36% తగ్గింది. తృణధాన్యాల సాగు 4.21%, నూనెగింజల సాగు 1%, చెరకు సాగు 0.41%, పత్తిసాగు 0.43% మేర తగ్గింది. పప్పుదినుసుల సాగుమాత్రం 1.39% పెరిగింది.
గత ఏడాది (2025) ఇదే సమయానికి అన్ని పంటలూ కలిపి 1,090.01 లక్షల హెక్టార్లలో సాగుకాగా, ఈ ఏడాది అది 1,071.10 లక్షల హెక్టార్లకు తగ్గింది. వరిసాగు 428.46 లక్షల హెక్టార్ల నుంచి 414.10 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. ఇందులో కర్ణాటకలో 3.61లక్షల హెక్టార్లు, తెలంగాణలో 3.29 లక్షలు, ఝార్ఖండ్‌లో 1.82 లక్షల హెక్టార్ల మేర తగ్గినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.