భారతీయ ప్రామాణిక సమయాన్ని (ఇండియన్ స్టాండర్డ్ టైం) కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది. లీగల్ మెట్రాలజీ చట్టం-2009లోని సెక్షన్ 52కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం (యూటీసీ)కి 5.30 గంటలను జతచేస్తే వచ్చే సమయాన్ని భారతీయ ప్రామాణిక సమయంగా ప్రకటించింది. అదే అధికారిక సమయం అని, దాన్నే భారత్‌లో వాణిజ్య, న్యాయపరమైన కార్యకలాపాలకోసం ఉపయోగించాలని స్పష్టంచేసింది.
సమయాన్ని గంటలు: నిమిషాలు: సెకెండ్ల రూపంలో ప్రదర్శించాలి. లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్‌టైం) రూల్స్-2026 పేరుతో జారీచేసిన ఈ నిబంధనలు 180 రోజుల తర్వాతి నుంచి అమల్లోకి వస్తాయి.