లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం

లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. రాజ్యాంగ అధికరణ 240, జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం-2019లోని సెక్షన్‌ 58(2)కింద తనకున్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ కొత్త ధర్మాసనం ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ప్రస్తుతం ఉన్న చోటనే (శ్రీనగర్‌/జమ్ము) కొనసాగుతుంది. ఇప్పుడు అదనంగా లద్దాఖ్‌లో ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram