యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం

యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం

57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్‌పుర్‌ వెహికల్‌ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్‌ యూనిట్‌లో రూ.472 కోట్ల వ్యయంతో టీ-సిరీస్‌ యుద్ధ ట్యాంకుల మరమ్మతులు/పునరుద్ధరణ కేంద్ర నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. జబల్‌పుర్‌ కేంద్రం ద్వారా ఏటా 80 టి-72, టి-90 ట్యాంకులను ఓవర్‌హాల్‌ చేస్తారని, సైన్యానికి ఏటా దాదాపు 230 ట్యాంకుల ఓవర్‌హాల్‌ అవసరమని మంత్రి వెల్లడించారు. తమిళనాడు, అవడిలోని హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఏటా దాదాపు 150 ట్యాంకులను ఓవర్‌హాల్‌ చేస్తోందని, మిగిలినవాటిని జబల్‌పుర్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త కేంద్రం చేస్తుందని రక్షణ మంత్రి వివరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram