అయోధ్య రామాలయ ట్రస్ట్‌ తొలి సీఈవో

అయోధ్య రామాలయ ట్రస్ట్‌ తొలి సీఈవో

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) మాజీ ఉన్నతాధికారి, ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్ర.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తొలి సీఈవోగా 2026, సెప్టెంబరు 2న నియమితులయ్యారు. అయోధ్య రామాలయం నిర్వహణ, కార్యకలాపాలు ఈ ట్రస్ట్‌ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. సీఈవో పోస్టుకు మొత్తం 5,585 దరఖాస్తులు రాగా వివిధ దశల్లో వాటిని వడగట్టిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రమోద్‌ కోహ్లీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ...చివరకు అన్ని విధాలా అర్హతలున్న, అత్యంత సమర్థులైన ముగ్గురు అభ్యర్థుల పేర్లను ట్రస్ట్‌కు సిఫార్సు చేసింది. ఆ ముగ్గురిలో ఎయిర్‌ మార్షల్‌ (రిటైర్డ్‌) జితేంద్ర మిశ్ర (62) ఎంపికయ్యారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram