మోహిత్‌ జైన్‌

మోహిత్‌ జైన్‌

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2026-27 సంవత్సరానికి మోహిత్‌ జైన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బెన్నెట్‌ కోల్‌మ్యాన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) బోర్డు సభ్యుడిగా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (పబ్లిషింగ్‌)గా ఉన్నారు. ఆయన ఎన్నికతో ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎకనామిక్‌ టైమ్స్‌ వంటి దినపత్రికలను ప్రచురించే దేశీయ అతిపెద్ద మీడియా సంస్థ బీసీసీఎల్‌కు 43 ఏళ్ల తర్వాత ఏబీసీ ఛైర్మన్‌షిప్‌ తిరిగి లభించినట్లయ్యింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram