‘రోమన్‌’

‘రోమన్‌’

ఖగోళంలో మన సౌరమండలానికి వెలుపల ఆవాసయోగ్య గ్రహాలేవైనా ఉన్నాయా? విశ్వం నిరంతరం వ్యాప్తి చెందడానికి చోదకశక్తిని అందిస్తున్న డార్క్‌ ఎనర్జీ రహస్యం ఏమిటి? లాంటి అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానాలను వేగంగా కనుగొనేందుకు ఉద్దేశించిన అత్యాధునిక న్యాన్సీ గ్రేస్‌ రోమన్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించింది. 430 కోట్ల డాలర్ల వ్యయంతో రూపొందించిన భారీ టెలిస్కోప్‌ను 2026, ఆగస్టు 30న కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ ఆకాశంలోకి మోసుకెళ్లింది. గమ్యస్థానం చేరుకోవడానికి మూడు నెలలకు పైగా సమయం పడుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram