భారత సైన్యం పోరాట పటిమను పెంచే చర్యల్లో భాగంగా ‘‘జావెలిన్’’ అనే ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒక ‘‘లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్’’పై భారత సైన్యం సంతకం చేసింది.
జావెలిన్ క్షిపణిని భుజంపై నుంచి శత్రు ట్యాంకుల పైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. ఇందులో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి.