జాతీయ ప్రాధాన్య ప్రాంతంగా గొల్లలగుడి ఆలయం

జాతీయ ప్రాధాన్య ప్రాంతంగా గొల్లలగుడి ఆలయం

ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని రామప్ప ఆలయ సమీపంలోని గొల్లలగుడి ఆలయాన్ని జాతీయ ప్రాధాన్య ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతికశాఖ 2026, సెప్టెంబరు 1న నోటిఫికేషన్‌ జారీ చేసింది. రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో దాని చుట్టుపక్కల సర్వే నం.417/3లో 0.25 ఎకరాల్లో ఉన్న ప్రాంతాన్ని సంరక్షించేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ గొల్లలగుడి ఆలయాన్ని జాతీయ ప్రాధాన్య కేంద్రంగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ మార్చి 6వ తేదీన ముసాయిదా జారీ చేసింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించింది. రెండు నెలల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram