ఆటోరిక్షాల వినియోగంలో కీలక మార్పు

ఆటోరిక్షాల వినియోగంలో కీలక మార్పు

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) ప్రాంతంలో ఆటోరిక్షాల వినియోగంలో కీలక మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న 18,766 ఆటోలను పూర్తి ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ మార్పిడి పథకం-2026’ను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆటోడ్రైవర్లకు రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా ఈ ప్రయోజనం లభించనుంది. ఈ పథకం అమలుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram