ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • సీనియర్‌ రెసిడెంట్‌ - 42

విభాగాలు: అనాస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, పల్మొనరీ మెడిసిన్ తదితర విభాగాలు

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు

జీతం: నెలకు రూ.67,700

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 08

ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 9, 10

Website: https://www.aiimsgorakhpur.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram