ఆర్‌ఆర్‌సీ- సదరన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

ఆర్‌ఆర్‌సీ- సదరన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) సదరన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌లు/ వర్క్‌షాప్‌లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 4,471

వివరాలు:

  • ఫ్రెషర్‌ కేటగిరి యూనిట్ల వారీగా ఖాళీలు:

  1. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ వర్క్స్/ పెరంబూర్- 80

  2. సెంట్రల్‌ వర్క్‌షాప్‌, పొన్మలై: 43

  3. ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్‌, పొదనూర్‌, కోయంబతూర్‌: 20

  4. రైల్వే హాస్పిటల్/ పెరంబూర్: 20

  • ఎక్స్‌-ఐటీఐ విభాగాల వారీగా ఖాళీలు:

  1. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ వర్క్స్ గ్రూప్‌: 1,528

  2. సెంట్రల్‌ వర్క్‌షాప్స్‌, పొన్మలై గ్రూప్‌: 1,292

  3. ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్‌ పొదునూర్‌ గ్రూప్‌: 1,488

ట్రేడులు: ఫిట్టర్‌, పాయింటర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, ఎంఎంవీ, టర్నర్‌, డిజిల్‌ మెకానిక్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, వైర్‌మ్యాన్‌, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్‌, ప్లంబర్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-సివిల్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, గ్యాస్‌ కట్టర్‌, ఎంఎంటీఎం తదితరాలు.

అర్హత: టెన్త్‌, 12వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడులో ఐటీఐ+ఎస్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సర్టిఫికెట్‌ ఉండాలి.

స్టైపెండ్‌: ఫ్రెషర్స్‌(టెన్త్‌ ఉత్తీర్ణులకు) రూ.8,200; ఫ్రెషర్స్‌ 12వ తరగతి ఉత్తీర్ణులకు రూ.9600; ఎక్స్‌ ఐటీఐ అభ్యర్థులకు రూ.9,600.

వయోపరిమితి: నాటికి ఫ్రెషర్లు 15 నుంచి 22 ఏళ్ల మధ్య, ఎక్స్‌-ఐటీఐ/ ఎంఎల్‌టీ అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2026.

Website: https://sr.indianrailways.gov.in/?lang=1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram