జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య సంచాలకుల ( డీఎంఈ) పరిధిలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ నల్గొండ) తాత్కాలిక /కాంట్రాక్ట్ ప్రాతిపదికన నల్గొండ జీఎంసీ అనుబంధ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 57

వివరాలు:

  1. అసోసియేట్ ప్రొఫెసర్- 11

  2. అసిస్టెంట్ ప్రొఫెసర్- 26

  3. ట్యూటర్- 11

  4. సివిల్ అసిస్టెంట్ సర్జన్- 09

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.. తదితరాలు.

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎన్‌ఎమ్‌సీ (NMC) నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/ఎంఎస్‌స్సీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పోస్టును బట్టి ఉద్యోగానుభం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2026 నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 500.

జీతం: నెలకు అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,25,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.55,000, ట్యూటర్‌కు రూ.55,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌కు రూ. 52,000. వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: అనుభవం, అర్హతలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్, నకళ్లను "ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, నల్గొండ" కార్యాలయంలో ప్రత్యక్షంగా అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 05-09-2026

దరఖాస్తుల చివరి తేదీ: 10.09.2026.

ప్రాథమిక జాబితా ప్రకటన: 22-09-2026

అసలు సర్టిఫికేట్ల పరిశీలన: 28-09-2026.

తుది ఎంపిక జాబితా: 30-09-2026.

Website: https://www.gmcnalgonda.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram