ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌- ఆర్‌ఆర్‌బీ (CRP RRBs XV) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌-ఏ ఆఫీసర్లు(స్కేల్‌--I, II, III), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 13,706

వివరాలు:

  1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 8,183

  2. ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్‌ మేనేజర్‌): 4,256

  3. ఆఫీసర్‌ స్కేల్‌-II- (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 666

  4. ఆఫీసర్ స్కేల్-II (ఐటీ): 182

  5. ఆఫీసర్‌ స్కేల్‌-II (చార్టర్డ్‌ అకౌంటెంట్‌): 81

  6. ఆఫీసర్ స్కేల్-II (లా): 46

  7. ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్): 18

  8. ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్): 16

  9. ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 38

  10. ఆఫీసర్‌ స్కేల్‌-III (సీనియర్‌ మేనేజర్‌): 220

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21-32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21-40 ఏళ్లు; ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.

తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌/ మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్, వరంగల్‌, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 01.09.2026 నుంచి 21.09.2026

అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 01.09.2026 నుంచి 21.09.2026 వరకు.

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: నవంబరు 2026

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: నవంబరు/డిసెంబరు

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబరు/డిసెంబరు

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: డిసెంబరు 2026/జనవరి 2027

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: డిసెంబరు 2026/జనవరి 2027

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష తేదీ: జనవరి 2027

మెయిన్స్‌/ సింగిల్‌ ఫలితాల వెల్లడి (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3): జనవరి 2027

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): జనవరి 2027

ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): జనవరి/ఫిబ్రవరి 2027

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): ఫిబ్రవరి/మార్చి 2027

Website: https://www.ibps.in/index.php/rural-bank-xv/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram