ఎస్‌ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

ఎస్‌ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్ఈసీఐఎల్‌) రెగ్యులర్‌, ఫిక్స్‌టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన మేనేజీరియల్‌, ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28

వివరాలు:

  • జనరల్‌ మేనేజర్‌: 01

  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01

  • డిప్యూటీ మేనేజర్‌: 10

  • అకౌంట్స్‌ ఆఫీసర్‌: 01

  • ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌): 03

  • ఇంజినీర్‌(కార్పొరేట్‌ ప్లానింగ్‌): 01

  • సీనియర్‌ ఇంజినీర్‌: 11

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ, సీఎంఏ, ఎంబీఏ/పీజీడీఎం, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం: నెలకు అడిషన్‌ జనరల్ మేనేజర్‌కు రూ.లక్ష- రూ.1,20,000-2,80,000; డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000-రూ.1,80,000; ఆఫీసర్‌కు రూ.40,000- రూ.1,40,000;సీనియర్‌ ఇంజినీర్‌కు ఏడాదికి రూ.9.9 లక్షలు.

వయోపరిమితి: జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు; డిప్యూటీ జనరల్ మేనేజర్ 45 ఏళ్లు; ఇంజినీర్‌కు 28 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు; సీనియర్‌ ఇంజినీర్‌ 33 ఏళ్లు, ఆఫీసర్‌కు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రెగ్యులర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.1000; ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 23.09.2026.

Website:https://www.seci.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram