రామగుండం ఫెర్టిలైజర్స్‌లో పోస్టులు

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో పోస్టులు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివరాలు:

  • కెమికల్‌: 18

  • మెకానికల్‌: 03

  • ఎలక్ట్రికల్‌: 03

  • ట్రాన్స్‌పోర్టెషన్‌: 01

  • హ్యూమన్‌ రిసోర్స్‌: 02

  • మెడికల్‌: 02

  • ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్: 06

  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 01

పోస్టులు: ఇంజినీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, ఇంజినీర్‌, ఆఫీసర్‌, ఆఫీసర్‌ సెక్రటేరియల్‌, అడిషనల్‌ సీఎంఓ, సీఎంఓ, అకౌంట్స్‌ ఆఫీసర్‌, చీఫ్‌ మేనేజర్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంబీబీఎస్‌, సీఏ/సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: ఇంజినీర్‌కు రూ.40,000- రూ.1,40,000; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; అడిషనల్‌ సీఎంఓకు రూ.70,000- .2,00,000; సీఎంఓకు రూ.80,000- రూ. 2,20,000; చీఫ్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000.

వయోపరిమితి: ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్‌/డిప్యూటీ మేనేజర్లకు 40 ఏళ్లు; అడిషనల్‌ సీఎంఓకు, సీఎంఓకు 45 ఏళ్లు; చీఫ్‌ మేనేజర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తయ్యాక ప్రింట్‌ తీసుకొని అవసరమైన ధ్రువపత్రాలతో నోయిడా కార్పొరేట్‌ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు ఫీజు: రూ.700- రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 24.09.2026

హార్డ్‌ కాపీలు పంపించడానికి చివరి తేదీ: 01.10.2026

Website:https://www.rfcl.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram