నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో పోస్టులు

నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో పోస్టులు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 376

వివరాలు:

విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:

కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 300

  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: 26

  • డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌: 50

అర్హతలు: సంబంధితం ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ/ఎంఎస్‌/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే గేట్‌ (2024/2025/2026) స్కోర్‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.35,400- రూ.1,12,4000

వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 35 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, గేట్‌ స్కోర్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు, జనరల్‌ అభ్యర్థులకు రూ.800. ఒకటి కంటే ఎక్కువ విభాగాలకు దరఖాస్తు చేస్తే ప్రతి విభాగానికి రూ.800 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 01.09.2026.

దరఖాస్తు చివరి తేదీ: 30.09.2026.

Website:https://recruitment.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram